ఏలూరు పడమరవీధికి చెందిన శ్రీనివాసరావుకి ఆటో నగర్లో టైర్ల దుకాణం ఉంది. ఇటీవల గన్నవరానికి చెందిన అజిద్ సాయిబాబా కొంతకాలం పరిచయమయ్యాడు. దీంతో అతని స్నేహితుడు గుప్తా గన్నవరంలో కొత్త టైర్ల దుకాణానికి శ్రీనివాసరావు నుంచి రూ. 2. 21లక్షల విలువైన టైర్లను అప్పుగా తీసుకొని సొమ్ము చెల్లించకపోవడంతో సోమవారం రాత్రి శ్రీనివాసరావు ఫిర్యాదుతో అజిద్ సాయిబాబా, గుప్తాలపై రూరల్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.