మొగల్తూరులో 195 దరఖాస్తులు

66చూసినవారు
మొగల్తూరులో 195 దరఖాస్తులు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలో మొత్తం 5 మద్యం దుకాణాలు ఏర్పాటుకు సంబంధించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం ఐదు దుకాణాలకు 195 దరఖాస్తులు అందాయని సంబంధిత అధికారులు గురువారం తెలిపారు. గడువు ఇంకా ఉన్నందున దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్