పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు

85చూసినవారు
పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు
పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించాలని నరసాపురం 6వ సచివాలయ ఏఎన్ఎం పుణ్యవతి అన్నారు. పట్టణంలోని పార్క్ రోడ్డు ఎంసీహెచ్ సెంటర్లో బుధవారం వైద్య సిబ్బంది పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పిల్లలకు వయసు వారీగా క్రమం తప్పకుండా టీకాలు వేయించాలన్నారు. టీకా వేసిన అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు వివరించారు.

సంబంధిత పోస్ట్