అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

51చూసినవారు
స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్యఅతిథిగా హాజరై అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ, టిడిపి ఇన్ ఛార్జ్ పొత్తురి రామరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్