పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలోని సాయి పెట్రోల్ బంకును తూనికలు కొలతల శాఖ జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ రాజేష్ తనిఖీ గురువారం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోలు, డీజిల్ ఖచ్చితమైన తూకంతో అందించాలని నిర్వాహకులకు సూచించారు. పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ నాణ్యత ప్రమాణాలు తూకం, రేటు, భద్రత ప్రమాణాలు వినియోగదారులకు అందించాలని సూచించారు.