వైభవంగా అన్నదాన కార్యక్రమం
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో 44వ వినాయక చవితి వార్షిక మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పరిసర గ్రామాల నుండి ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ పెద్దలు దాతలు భక్తులు సహకారంతో అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.