ఉంగుటూరు: రేపటి నుంచి అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు

53చూసినవారు
ఉంగుటూరు: రేపటి నుంచి అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవై ఈవో నిమ్మగడ్డ రవీంద్రభారతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల బాలికల అండర్-14 విభాగంలో ఉమ్మడి 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతారన్నారు. అదేవిధంగా ఈ పోటీలను విజయవంతం చేసేందుకు 40 మంది వ్యాయామ ఉపాధ్యాయులను వివిధ కమిటీలుగా నియమించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్