సింహాచలానికి చెందిన శ్రీరామచంద్రాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకు కులశేఖర్ జన్మించారు. విశాఖలోని బీవీకే కాలేజీలో డిగ్రీ వరకు చదివారు. ఆ తర్వాత సినిమాల్లో పాటల రచయితగా ఎంట్రీ ఇచ్చారు. గాజువాక పిల్లా.. వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలు రాశారు. చివరకు హైదరాబాద్‌లో రోడ్డుపై కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మార్చరీకి మృతదేహాన్ని తరలిస్తుండగా.. ఓ నర్సు కులశేఖర్‌ను గుర్తించారు. దాంతో అసలు విషయం బయటకొచ్చింది.