ఉదృతంగా ప్రవహిస్తున్న గోస్తని డ్రైన్
ఇరగవరం మండల కేంద్రం ఇరగవరం, అర్జునుడుపాలెం, రేలంగి, జుత్తిగ, పెనుమంట్ర తదితర ప్రాంతాల మీదుగా ప్రవహించే గోస్తని డ్రైన్ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తుంది. వంతెనల ఎత్తుకు సమాంతరంగా నీటి ప్రవాహం చేరింది. మరోపక్క పలుచోట్ల గోస్తని డ్రైన్ ని అనుకుని ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు ఎదురుకుంటున్నారు.