యూపీలోని హాపూర్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఓ వ్యక్తి సరస్వతి ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న అతడికి ఆసుపత్రి సిబ్బంది ఆహారం అందించారు. అయితే తింటున్న ఆహారాన్ని పరిశీలించగా, అందులో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ తర్వాత రోగి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ ఘటనపై పోలీసులకు రోగి భార్య ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.