పాలకొల్లులో పట్టపగలే చోరీ
పాలకొల్లులోని ఓ బంగారు దుకాణంలో శనివారం చోరీ జరిగింది. స్థానికుల వివరాలు. పట్టణంలోని శివాజీ జ్యువెలరీ దుకాణానికి ఓ యువతి (22) వచ్చింది. సిబ్బంది ఏం కావాలని ప్రశ్నించగా. తన తల్లి బ్యాంకుకు వెళ్లిందని, అక్కడ రద్దీగా ఉందని ఇక్కడికి వచ్చానని చెప్పింది. చాలాసేపు వేచి ఉన్న తర్వాత 10 గ్రాముల బంగారు ఆభరణాలతో పారిపోయేందుకు యత్నించింది. గమనించిన సిబ్బంది వెంటనే పట్టుకొని పట్టణ పోలీసులకు అప్పగించారు.