పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం పీవో, సిబ్బందిపై వేటు?

71చూసినవారు
పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం పీవో, సిబ్బందిపై వేటు?
విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రం పీవో, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. పోలింగ్ రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్నా అడ్డుకోకపోవడం సీసీ ఫుటేజీలో రికార్డయింది. వీటిని పరిగణనలోకి తీసుకుని పీవోతో పాటు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్వో శ్యాంప్రసాద్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.