వైసీపీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదన్నారు. గత ఐదేళ్లలో అధికార యంత్రాంగం ఏమైపోయిందని ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో ఒక్క గ్రామ సభ నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు వచ్చిన నిధులన్నీ ఏమైపోయాయని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.