ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో రక్షణ అనే చిన్నారి ఐదేళ్లుగా పాలు, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. రక్షణకు అన్నప్రాసన రోజు నుంచి ఒక నెల కాలం ఆహారం తీసుకోగానే వాంతులు అయ్యేవి. దీంతో పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలికకు అన్నవాహిక, పెద్దపేగు మూసుకుపోయాయని.. 10 లక్షల మందిలో ఒకరికి వచ్చే వ్యాధి అని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని తండ్రి భాస్కర్ వేడుకుంటున్నారు.