TG: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నిన్న మహిళా అఘోరీ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఆలయం ఎదుట ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడింది. వీడియో రికార్డు చేస్తున్న ఓ రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేసింది. ఈ ఘటనపై సిద్దిపేట సీపీ ఆదేశాలతో చేర్యాల పోలీసులు నాలుగు సెక్షన్ల కింద అఘోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.