ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి భార్య రాజేశ్వరిదేవి అంత్యక్రియలను బుధవారం తణుకులో నిర్వహించారు. అంతిమ యాత్రలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, సినీ నటుడు రానా పాల్గొన్నారు. రానాకు రాజేశ్వరీదేవి స్వయానా అమ్మమ్మ కావడంతో పాడె మోశారు. దగ్గుపాటి సురేష్ ఆమెకు అల్లుడు.