ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించే విషయంలో అవసరమైతే టీడీపీతో కలిసి పని చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ తమ రాష్ట్రానికి వద్దని స్పష్టం చేశారు. వైసీపీ గత పదేళ్లుగా ఇదే స్టాండ్ మీద ఉందని మిథున్ రెడ్డి తెలిపారు.