ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు 30తో ముగియనుండగా ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు ఎవరూ హాజరుకాలేదు. మరి ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారో లేదో అనే దానిపై స్పష్టత లేదు.