TS: హైదరాబాద్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణా ప్రతాప్‌నగర్‌లో రెండేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ కుక్కలు తన వైపునకు రావడంతో భయపడి ఇంట్లోకి పరుగెత్తాడు. అయినా నాలుగు కుక్కలు బాలుడిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి దాడి చేశాయి. బాబు ఏడుపు విని ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులు పరుగునా వచ్చి కుక్కలను తరిమేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.