AP: నగరాల్లో ఇళ్లు నిర్మించుకోవాలంటే సవా లక్ష అడ్డంకులు.. ప్లాన్ అవ్రూవల్ కోసం మున్సిపల్ అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. ఇలాంటి వారి ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం.. నగరాల్లో నిర్మించే 100 గజాల్లోపు గృహాలకు ‘ప్లాన్ అప్రూవల్’ ప్రక్రియను మినహాయించేందుకు సిద్ధమైంది. దీనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పి.నారాయణ తెలిపారు. 300 గజాల్లోపు ఇళ్లకు సులభతరంగా ప్లాన్ ఆమోదం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.