AP: గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతంపై వైసీపీ అధిష్టానం సీరియస్‌గా దృష్టి పెట్టింది. నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తోంది. ఆసక్తి ఉన్నవారికి అడిగిన చోట అవకాశమిస్తోంది. మరికొన్ని చోట్ల బలమైన నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. జిల్లాలో బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తోంది.