ఏపీలో రాజకీయం ఎన్నో మలుపులు తిరుగుతోంది. అయితే ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి ఐప్యాక్ టీమ్‌నే మళ్లీ నియమించుకోనుంది. ఐ ప్యాక్ టీం కోసం, వారి సేవల కోసం వైసీపీ ఎంత ఖర్చు చేయబోతోంది అంటే ఏడాదికి రూ. 24 కోట్లు వంతున రానున్న నాలుగేళ్ల కాలానికి వంద కోట్లు ఖర్చు చేయబోతోందని అంటున్నారు. నెలకు రెండు కోట్లు వంతున ఐప్యాక్ టీం కోసం పార్టీ వెచ్చించనుంది అని అంటున్నారు.