సీఎం రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. గరీబి హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని మండిపడ్డారు. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడిందని దుయ్యబట్టారు. ఈ మేరకు హరీష్ రావు ఎక్స్‌లో స్థానికులు కలెక్టర్‌పై దాడి చేసిన వీడియోను షేర్ చేశారు.