టీడీపీ కార్యకర్త చెవి కోసేసిన వైసీపీ నేత

73చూసినవారు
టీడీపీ కార్యకర్త చెవి కోసేసిన వైసీపీ నేత
ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైసీపీ నేత కోసేశాడు. పందువ గ్రామానికి తిమోతి ఇటీవల టీడీపీలో చేరాడు. దాంతో తిమోతిపై స్థానిక వైసీపీ నేత గురవయ్య అక్కసు పెంచుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగిపోయింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆస్పత్రిలో చేర్పించారు.

సంబంధిత పోస్ట్