తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయింది. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. కడుపునొప్పితో వాంతులు, విరేచనాలు కావడంతో 30 మంది విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం 27 మంది విద్యార్థులు కోలుకోగా ఇద్దరు వాంకిడి, మరోకరు ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు.