AP: మాజీ సీఎం వైఎస్ జగన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫ్యామిలీ ఫొటో వైరల్ అవుతోంది. లండన్‌లో చదువు పూర్తి చేసుకున్న చిన్న కుమార్తె వర్షారెడ్డికి అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్స్ డియర్. నువ్వు కింగ్స్ కాలేజ్ లండన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాకుండా డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించి మమ్మల్ని గర్వపడేలా చేశావు. నీకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అని జగన్ రాసుకొచ్చారు.