జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైక్ ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదని, ప్రజల సమస్యలపై మాట్లాడటానికని తెలిపారు. ఆయన తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించనట్లుందన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాననడం జగన్ అవివేకానికి, అజ్ఞానికి నిదర్శనమని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేనప్పుడు రాజీనామా చేయాలన్నారు.