ప్రొద్దుటూరులో నిరాశ్రయులకు అన్నదానం

62చూసినవారు
ప్రొద్దుటూరులో నిరాశ్రయులకు అన్నదానం
ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక కొర్రపాడు రోడ్డులోని పాత బస్టాండ్ వద్ద శనివారం మధ్యాహ్నం సీమాంధ్ర బీసీ నాయకులు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 800 మందికి పైగా వృద్ధులకు, నిరాశ్రయులకు, సాధువులకు, ప్రయాణికులకు అన్నదాన వితరణ చేశారు. అనంతరం చల్లా మాట్లాడుతూ. ప్రతి శనివారం పట్టణంలో అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్