నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడి దాడి ఘటన మరవక ముందే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. స్టార్ కమెడియన్ కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. విష్ణు అనే వ్యక్తి నుంచి వీరికి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. 'మేము మీ ప్రతి కదలికను గమనిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ కాదు. మీరు ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోండి' అని మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.