తమ బలగాలు రష్యాలోని కుర్స్ ప్రాంతంలో మరింత ముందుకు చొచ్చుకెళ్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బుధవారం తెలిపారు. ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ ఒలెక్సాండ్ సైర్సైతో ఆయన వీడియో కాల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ బలగాలు రష్యా సరిహద్దు దాటిన తర్వాత కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల వరకు రష్యాలోకి తమ బలగాలు ప్రవేశించాయని తెలిపారు. 100 మంది రష్యా సైనికులు తమ అదుపులో ఉన్నారని తెలిపారు.