ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన 1000 ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టులను భర్తీ చేయబోతోంది. డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు రెండేళ్లు విధుల్లో కొనసాగుతారు. తర్వాత సంస్థ అవసరాల ప్రకారం శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 16. వెబ్సైట్: https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx