విరాట్ కోహ్లి గత 5 ఏళ్లలో కేవలం మూడు టెస్టు సెంచరీలు చేయడం ఆందోళన కలిగిస్తోందని ఇటీవల మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. “అసలు పాంటింగ్‌కు భారత క్రికెట్‌కు సంబంధం ఏంటి? అతను ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి చూసుకోవాలి. కోహ్లి-రోహిత్ మంచి స్థితిలోనే ఉన్నారు. వాళ్లు నిరూపించుకున్న ఆటగాళ్లు" అని గంభీర్ విలేకర్ల సమావేశంలో అన్నారు.