జార్ఖండ్లో నిర్వహించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఫిజికల్ టెస్టుల్లో పాల్గొన్న అభ్యర్థుల్లో 11 మంది మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. గత నెల 22న ఏడు సెంటర్లలో ఫిజికల్ టెస్టులు ప్రారంభం కాగా.. మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్ వెల్లడించారు. వీటిని అసహజ మరణాలుగా పేర్కొంటూ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.