SBI తాజాగా గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12,000ల మందిని నియమించుకుంటామని, వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉంటారని తెలిపింది. వారికి బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణ అందించి, తర్వాత వివిధ వ్యాపార విభాగాల్లో నియమించనున్నట్లు SBI ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. బ్యాంకింగ్ సెక్టార్‌లో టెక్నాలజీపై ఆధారపడడం పెరగడంతో, అందుకు అనుగుణంగా నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు.