ఏపీ ప్రజలకు బిగ్ షాక్ తగలనుంది. వచ్చే నెల నుంచి కరెంట్ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ నుంచి సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. 15 నెలల పాటు ట్రూ అప్ ఛార్జీల వసూలుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో నవంబర్ నుంచి కరెంట్ బిల్లులలో అదనంగా సర్దుబాటు ఛార్జీల భారం పడే అవకాశాలున్నాయి.