TG: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను గొంతు నులిమి హత్యమార్చాడు ఓ భర్త. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలోని వెంకట్రావ్‌పేటలో బుధవారం జరిగింది. వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్, సునీత దంపతులు కొంతకాలంగా వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. అయితే ఉపాది కోసం రమేశ్ దుబాయ్‌కి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. బుధవారం సునీత తో గోడవకు దిగిన రమేశ్.. భార్య గొంతు నులిమి చంపి పరారయ్యాడు.