ఏపీలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు

56చూసినవారు
ఏపీలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
ఏపీలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తొలి సంతకం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంలో భాగంగా ఇంటింటికీ 3 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ అందించే దస్త్రంపై మూడో సంతకం చేశారు.