TG: ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 4,962.47 కోట్లు కేటాయించింది. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు, మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ. 205 కోట్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు 160.92 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మిగిలిన అభివృద్ధి పనులకు సైతం భారీగా నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది.