6 నెలల్లో 557 మంది రైతుల ఆత్మహత్యలు

53చూసినవారు
6 నెలల్లో 557 మంది రైతుల ఆత్మహత్యలు
దేశానికి అన్నం పెట్టే రైతన్నల ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. తీవ్ర కరవు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాల వల్ల రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోని అమరావతి పరిపాలనా విభాగం పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో 500 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డివిజన్‌లోని అమరావతి, అకోలా, బుల్దానా, వాసిమ్‌, యవత్మాల్‌ జిల్లాల్లో ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో 557 మంది రైతులు తనువుచాలించారు.

సంబంధిత పోస్ట్