మహారాష్ట్రలోని థానేలో గల డోంబివిలిలో తన 6 ఏళ్ల కూతురిపై ఏడాదిన్నరగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 42 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 2023 జూన్ నుంచి సదరు నిందితుడు ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.