2023 మే 19న రూ.2,000 నోట్లను చలామణి ఉపసంహరించిన తర్వాత ఇప్పటివవరకు 98.04 శాతం నోట్లు బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇంకా ప్రజల వద్ద రూ.6,970 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది. 2023 మే 19న మొత్తం దేశంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటిలో 98.04 శాతం తిరిగి వచ్చేశాయని పేర్కొంది.