ఈ నెల 9న జగన్, షర్మిల ఆస్తుల కేసు విచారణ?

52చూసినవారు
ఈ నెల 9న జగన్, షర్మిల ఆస్తుల కేసు విచారణ?
వైఎస్ జగన్ ఆస్తుల విషయంలో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 9న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో విచారణ జరగనుందని ప్రచారం జరుగుతోంది. తన ప్రమేయం లేకుండా సరస్వతి సిమెంట్ ప్రాజెక్టులో షేర్లు బదిలీ అయ్యాయని పేర్కొంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను చేర్చారని అంటున్నారు. దీంతో వారి తరపున లాయర్లు ఏ రకమైన వాదనలు వినిపిస్తారోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్