AP: రైస్ మిల్లర్లకు బకాయిల చెల్లింపులో గత ప్రభుత్వం అన్యాయం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌరసరఫరాల శాఖలో రూ.41,150 కోట్ల బకాయిలు పెట్టారని పేర్కొన్నారు. రుణాలు తీసుకుని రైతులకు చెల్లించలేదని మండిపడ్డారు. రూ.1,674 కోట్ల బకాయిలను రైతులకు నెల రోజుల్లో చెల్లించామని తెలిపారు. రైస్ మిల్లర్లకు గత ప్రభుత్వం రూ.961 కోట్ల బకాయిలు పెట్టిందని వెల్లడించారు.