14 నెలల పసిపాపకు గుండె మార్పిడి విజయవంతం

59చూసినవారు
14 నెలల పసిపాపకు గుండె మార్పిడి విజయవంతం
బెంగుళూరులో 14 నెలల పసిపాపకు గుండెమార్పిడి చికిత్సను నారాయణ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చేశారు. 14 నెలల పాప గుండె సమస్యతో బాధపడుతుండగా, ఆమెకు గుండె మార్పిడి చేయాలని వైద్యులు నిర్ణయించారు. సరిగ్గా ఇదే సమయంలో రెండున్నరేళ్ల చిన్నారి అచేతన స్థితికి చేరి బ్రెయిన్ డెడ్ అయ్యింది. చిన్నారి కుటుంబం మానవత్వంతో అవయవదానానికి ఒప్పకుంది. ఆ చిన్నారి గుండెను తీసి 14 నెలల పాపకు అమర్చారు. పాప ఆరోగ్యంగా ఉండని డాక్టర్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్