రాజస్థాన్‌లోని ఝుంజును సిటీలో షాకింగ్ ఘటన జరిగింది. చికిత్స పొందుతూ రోహితాష్ (25) అనే బధిర యువకుడు గురువారం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయాడనుకుని పోస్టుమార్టం గదిలోని డీప్ ఫ్రీజర్‌లో 2 గంటల పాటు యువకుడిని ఉంచారు. అనంతరం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా చితిపై నుంచి రోహితాష్ లేచాడు. తిరిగి ఆసుపత్రికి తరలించగా శుక్రవారం కన్నుమూశాడు. దీనిపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.