ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకు శుక్రవారం శాసనమండలి ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024కు, గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లుకు, సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు, ప్రివ్యూ రద్దు బిల్లుకు, చెత్తపై పన్ను చట్టాన్ని రద్దు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదించారు. పీడీ యాక్ట్ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది.