14 ఏళ్ల బాలికపై మత పెద్ద అత్యాచారం

54459చూసినవారు
14 ఏళ్ల బాలికపై మత పెద్ద అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన జరిగింది. సోనూ హఫీజ్ అనే మత పెద్ద 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. అనంతరం అబార్షన్ కోసం బాలికకు మాత్రలు ఇచ్చాడు. ఆ మాత్రలు వేసుకున్న బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మత పెద్ద హఫీజ్‌ను అరెస్టు చేశారు.