ప్రపంచవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల లోపల పరిస్థితులు నేటి వరకు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి. గనులు కూలిపోవడం, కార్మికులు గనుల్లో చిక్కుకు పోవడం లేదా చనిపోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కార్మికులకు బొగ్గు ధూళి అనేక శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు ప్రమాదకర విషవాయువుల బారిన పడి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.