అమెరికాలోని హైస్కూల్లో నలుగురిని కాల్చి చంపిన 14 ఏళ్ల విద్యార్థి అరెస్టు

60చూసినవారు
అమెరికాలోని హైస్కూల్లో నలుగురిని కాల్చి చంపిన 14 ఏళ్ల విద్యార్థి అరెస్టు
అమెరికాలోని ఓ హైస్కూల్లో నలుగురిని కాల్చి చంపిన 14 ఏళ్ల విద్యార్థి కోల్ట్ గ్రేను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఏఆర్-15 స్టైల్ రైఫిల్స్ తో కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ టీనేజర్ ఎందుకు కాల్పులు జరిపాడో వివరాలు తెలియాల్సి ఉంది. ఆన్ లైన్ లో బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఫిర్యాదులు రావడంతో గతేడాది గ్రేను పోలీసులు విచారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్