బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. వక్ఫ్ భూముల సమస్యతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రైతు రుద్రప్ప తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రి జమీర్ అహ్మద్ చర్యల వల్ల రైతులు కుంగిపోతున్నారని ఎంపీ సూర్య ఇటీవల సోషల్మీడియా వేదికగా ఆరోపించారు.